2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ప్రధానమైన కారణం ఉచిత పథకాలు. ప్రజలు ఎన్ని ఉచిత పథకాలు కావాలో అన్ని పథకాలను నవ రత్నాల రూపంలో ప్రకటించారు. ఇష్టమొచ్చినట్టు ఉచిత పథకాలను ప్రకటించారు. ఈ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు వైసీపీకి ఘన విజయం తెచ్చిపెట్టాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉచిత పథకాలను అమలు చెయ్యడానికి ఇష్టమొచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 70 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.
ఈ అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి పెనుభారంగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది. అయితే ప్రజా సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులు మాత్రం ప్రజలకు కూడా ఉపయోగించినట్టు ఎక్కడ కనపడటం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం చేసిన అప్పులను వైసీపీ నాయకులు తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం అవసరమా అని రాజకీయ విశ్లేషకులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.
ముందు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన తరువాత ఇలాంటి ఉచిత పథకాలను ప్రవేశపెట్టాలని రాజకీయ వర్గాలు వైసీపీకి సలహాలు ఇస్తుంది. ప్రజలు ఆర్థికంగా బలపరచడానికి పథకాలు రచించకుండా కేవలం ఉచిత పథకాలను రాజకీయ లబ్ది కోసం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు హయాంలో 30 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి వుందని,చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రాజకీయ నాయకులు ప్రవేశపెడుతున్న ఉచిత పథకాలన్నీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిందని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.