తాడేపల్లి బ్రేకింగ్ న్యూస్: ఆ ఎమ్మెల్యేలని పిలిచి టేబుల్ మీద వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకే చూపిస్తున్న జగన్..!

ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం వేరు.. సీఎం కుర్చీలో కూర్చోవడం వేరు. పార్టీ అధ్యక్షుడిగా కొంచెం అటూ ఇటూ ఉన్నా ఏం కాదు కానీ.. సీఎం కుర్చీ అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది. ఆ కుర్చీలో కూర్చున్నాక ఎంతో క్లారిటీగా ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

ap cm ys jagan serious warning to his mlas

ఏపీ సీఎం జగన్ లో అదే కనిపిస్తుంది. ఆయన సీఎం కాకముందు కంటే.. సీఎం అయ్యాక చాలా క్లారిటీతో ఉన్నారు. ఏ విషయంలోనైనా చాలా స్పష్టంగా ఉన్నారు. తనపైనే కాదు.. పార్టీపైనా… ప్రభుత్వంపైనా చిన్న మరక కూడా లేకుండా చూసుకుంటున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల దగ్గర్నుంచి ఆయన వేసే ప్రతి అడుగు ఆచీతూచీ వేస్తున్నదే. అదే ప్రస్తుతం ఆయన్ను వేరే ముఖ్యమంత్రుల్లో కాస్త భిన్నంగా చూపిస్తున్నాయి.

ప్రస్తుతం జగన్ ను వేలెత్తి చూపేవాళ్లు లేరు. ప్రతిపక్షాలు ఊరికే ఏదో ఒకటి వాగుతుంటాయి కానీ.. ఆధారాలతో సహా నిరూపించే దమ్ము ఏపీలో ఎవ్వరికీ లేదు. తను ఎలా ఉన్నారో.. తన పార్టీ నాయకులు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారు జగన్. వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త అయినా సరే.. ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా ఉండాలనేది జగన్ సిద్ధాంతం.

అయితే… ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవే జగన్ కు కంటగింపుగా మారుతున్నాయి. జగన్.. ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న సామ్రాజ్యాన్ని తన పార్టీ నేతలే కూల్చేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నారు.

అందుకే… తన ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే.. అవినీతికి పాల్పడుతున్నారు అని తెలిస్తే చాలు.. వెంటనే వాళ్లను క్యాంపు కార్యాలయానికి పిలిచి వార్నింగులు గట్రా ఇస్తున్నారు.

ఏదో ఊరికే వాళ్లను పిలిచి వార్నింగులు ఇవ్వడం కాదట.. వాళ్లు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఎటువంటి అవినీతి చేశారు.. అన్నింటికీ సంబంధించిన ఆధారాలతో సహా వాళ్లకు చూపించి వాళ్ల నోర్లు మూయిస్తున్నారట జగన్. ఇక.. వాళ్లు గుక్క తిప్పుకునే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలంతా కొంచెం ఒళ్లు దగ్గరపెట్టుకొని ఇప్పుడు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఎవరికి క్యాంప్ ఆఫీసు నుంచి ఫోన్ వస్తుందేమోనని టెన్షన్ తో వైసీపీ ఎమ్మెల్యేలంతా భయపడుతున్నట్టు వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.