ప్రజల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పధకాలను ప్రవేశపెడుతున్న ఏపీ సీయం వైఎస్ జగన్ తాజాగా గిరిజనుల సంక్షేమం కోసం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.. ఇందులో భాగంగా ప్రతి పేద గిరిజనుడికి రెండు ఎకరాల భూమిని ఇవ్వడమే కాకుండా, గిరిజన మహిళలకు కూడా రైతు భరోసా సొమ్మును అందిస్తామని హామీ ఇచ్చారు.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అటవీ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడి ఈ విషయాలు తెలియచేశారు..
కాగా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ క్రమంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకపోతే 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాలపై హక్కులను కల్పిస్తూ ఆర్ఎఫ్ఎఫ్ఆర్ పట్టాలను ఇవ్వడమే కాకుండా, 48,053 మంది గిరిజనులకు 76,480 ఎకరాల భూములను పంపిణీ చేయాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.. ఈ విషయంలో ఎటువంటి వివాదాలు లేకుండా భూమి పట్టాను గిరిజనుల పేరు మీద పంపిణి చేస్తున్నామని ఇలా చేయడం వల్ల గిరిజనుల ఆదాయం పెరగడంతో పాటు అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలియచేశారు..
ఇకపోతే గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని తాను పాదయాత్రలో గుర్తించినట్టుగా వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.. ఇదే కాకుండా ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడ ఏర్పాటు చేస్తున్నామని, గిరిజనులకు భూములతో పాటు ఏడాదికి రూ. 13,500 కూడ ఇస్తామని సీయం వైఎస్ జగన్ ప్రకటించారు.. అంతే కాక్ముడా గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని సీఎం పేర్కొన్నారు. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదని కానీ ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం అని తెలిపారు..