ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ రెండో రోజు సమావేశాలు కాస్త వాడీవేడీగానే జరిగాయి. మొదటి రోజు ప్రారంభం అవడమే సభలో గందరగోళం నెలకొన్నది. టీడీపీ సభ్యులు.. సభను నడవనీయకుండా అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని చంద్రబాబుతో సహా.. టీడీపీ ఎమ్మెల్యేలను హౌస్ నుంచి సస్పెండ్ చేశారు.
ఇవాళ కూడా టీడీపీ సభకు అడ్డుతగిలింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలను సస్పెండ్ చేశారు. అయినప్పటికీ.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నది.
ఉదయం నుంచి స్పీకర్ తమ్మినేనితో పాటు సీఎం కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. వాళ్లు ప్రతి విషయంలో అడ్డుతగులుతున్నారు.
ఈనేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ మండిపడ్డారు. వైసీపీ ఏ మేనిఫెస్టో అయితే విడుదల చేసిందో ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాల గురించే మాట్లాడుతుంటే.. చంద్రబాబు మాత్రం వేరే టాపిక్ మాట్లాడుతున్నారంటూ.. సీఎం జగన్ రెడ్డి తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
అర్జెంట్ గా ఈ మనిషిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి అధ్యక్షా? నేను మాట్లాడింతే మేనిఫెస్టోలో పెట్టాం. ఇలా పిచ్చితో ఉన్నవాళ్లు సమాజానికి, రాష్ట్రానికి అత్యంత హానికరం, ఈయన అప్పర్ కంపార్ట్ మెంట్ పూర్తిగా పోయింది. మనిషి ఇక్కడ లేరు. ఈయన వల్ల టీడీపీ లీడర్లకు కూడా త్వరలోనే పిచ్చి పడుతుంది అధ్యక్ష అంటూ ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.