గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనను ఒక ప్రభుత్వ అధికారి కంటే కూడా ప్రతిపక్ష నేతగా ఎక్కువగా చూస్తుంది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషినర్ రమేష్ కుమార్ మధ్య ఒక సైలెంట్ వార్ నడుస్తుంది. ఈ వార్ ఒక రకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగింపు ఇచ్చిన్నటు ఇప్పుడు కనిపిస్తుంది.
మొదట ఆ ఎన్నికలే…..
నిమ్మగడ్డ రమేష్ తాను పదవి విరమణ చేసేలోపు స్థానిక ఎన్నికలను నిర్వహించాలని చాలా ప్రయత్నిస్తున్నారు. దాని కోసం ఆయన కోర్ట్ ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మొదట తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో స్పెషల్ ఆఫీసర్ల పాలనను జూన్ నెల వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మే నెల తర్వాతనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది.
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జగన్
కానీ హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో స్పెషల్ ఆఫీసర్ల పాలనను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈలోపు తిరుపతి ఉప ఎన్నిక కూడా పూర్తవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పెడితే పార్టీకి సానుకూలత లభిస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.