ఢిల్లీకి ప్రయాణమైన ఏపీ సీఎం జగన్.. ప్రధానితో కీలక భేటీ

ఆదివారం సాయంత్రం అమరావతి నుండి ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఉదయం 10:30 కు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు. మన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం జగన్ ప్రధాని మోడీతో ప్రస్తావించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి, పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై సీఎం చర్చించారు.

రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని కోరినట్టు సమాచారం. సీఎం జగన్ రాష్ట్రానికి రావలసిన నిధుల అంశంపై ప్రధాని మోడీకి వినతి పత్రం అందించారు. ఇప్పటికే ప్రధానితో చాలాసార్లు భేటీ అయిన జగన్, తాజాగా రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మోడీతో భేటీ సమయంలో జగన్ తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. చివరిగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ తో జగన్ భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2, 900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధాని జగన్ కోరారు. సవరించిన అంచనాల ప్రకారం 55 వేల కోట్లు విడుదల కు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ ప్రధాని కోరారు.

అయితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రధానిని నిధుల విడుదల కోసం అడుగుతున్నానని, ఈసారి కూడా పీఎంను నిధుల అంశాన్ని విన్నవిస్తానని జగన్ ముప్పు మండలాలలో పర్యటన చేస్తున్నప్పుడు ప్రజలకు వెల్లడించారు. అలాగే రెవెన్యూ లోటు కింద కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు, విభజన సమస్యలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి రావాల్సిన 6627 కోట్ల విద్యుత్ బకాయిల విషయం కూడా ప్రధాని వద్ద ప్రస్తావించారు. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రధానిని సీఎం జగన్ కోరారు.