ఆర్ధికంగా ‘ ఏపీ ఎదగడం కోసం జగన్ టాప్ రిస్క్ ! 

 

ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇరుకున పడవేసేందుకు అధికారపార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతుందట. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి భారీగా ఖర్చుపెట్టే నాయకుల మీద దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.. కాగా ఇది వరకే వలసలను ప్రోత్సహించిన వైసీపీ సర్కార్, టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేయడం తెలిసిందే.. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో ఎవరైతే ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారో వారందరినీ కూడా వైసీపీలోకి ఆహ్వానించి, వారికి మంచి పదవులు ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారట ఏపీ సీఎం జగన్..

ఇదే కాకుండా విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ముగ్గురిని వైసీపీలోకి లాక్కునే విధంగా పావులు కదపగా, ఇప్పటికే వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే గంటా శ్రీనివాసరావు కూడా జై కొట్టే అవకాశం ఉంది అనే వార్త ప్రచారం అవుతుంది. ఒక్క ఎమ్మెల్యేనే కాకుండా విశాఖ నగర టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్న గణేష్ ఆ మహానగరంలో టిడిపిని కోలుకోలేని దెబ్బ తీస్తారని అంచనా. అలాగే ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఫైనాన్షియరు గా ఉన్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుని వైసీపీ ఇప్పటికే లాగేసింది. ఇంతే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో టిడిపికి ఆర్థిక అండదండలు అందించే నాయకులందరినీ ఆకర్షించే పనిలో వైసీపీ ఉందట.. ఇక విజయసాయిరెడ్డి గత వారం రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టుబడి పెట్టే వారిని ఆకర్శించేపనిలో పూర్తిగా నిమగ్నం అయ్యారట.. ఈ ప్రణాళికలన్ని పక్కాగా జరిగితే ఏపీలో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టలేని పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.. జగన్ చేస్తున్న ఈ టాప్ రిస్క్ చూస్తుంటే ముందు ముందు ఇంకా చిత్రమైన సంఘటనలు రాజకీయాల్లో చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తానికి చంద్రబాబుకు పెద్ద చిక్కుని తెచ్చేలా రచిస్తున్న వైసీపి వ్యూహం ఫలిస్తే మాత్రం జగన్‌కు తిరుగు ఉండదని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారట..