సర్కార్ దెబ్బ : “RRR” సినిమాకే దిమ్మదిరిగే షాక్ తగిలింది.!

Ap Cm Jagan Shocks Rajamouli | Telugu Rajyam

ఇప్పుడు భారత దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కించిన అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం “RRR” కూడా ఒకటి. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమాపై సమానమైన క్రేజ్ ఉంది. దీనితో బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఏపీ లో మాత్రం ఈ పెద్ద సినిమాకే ఇప్పుడు దిమ్మదిరిగే షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్న టికెట్ రేట్స్ దెబ్బకు ఈ సినిమాకి జరగాల్సిన అసలు బిజినెస్ ఉత్తరాది జిల్లాల్లో ఏకంగా 30 శాతం పడిపోయిందట.

నిర్మాతలు అడుగుతున్న ధరకు ఇక్కడ టికెట్ రేట్లు కి ఎంత గట్టిగా చూసినా పెద్ద లాభాలు రావని డిస్ట్రిబ్యూటర్స్ తక్కువం మొత్తానికి బిజినెస్ క్లోజ్ చేసారంటూ సినిమా సర్కిల్స్ లో బయటకొచ్చిన సరికొత్త టాక్. ఏపీ సర్కార్ దెబ్బకు ఇలాంటి పెద్ద సినిమా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సినిమాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం అనేది అంత సమంజసం కాదని ఎప్పుడు నుంచో మేజర్ ఆఫ్ పీపుల్ మాట. ఇక ముందు ఏపీలో టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles