ఏపీలోని సీ.ఐ.ఎస్.ఎఫ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. ఒకింత మంచి వేతనంతో?

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కానిస్టేబుల్, ట్రేడ్స్ మేన్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలోని సీ.ఐ.ఎస్.ఎఫ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం నిరుద్యోగులకు మేలు చేస్తుంది.

కానిస్టేబుల్, కుక్, కాబ్లర్, టైలర్, బార్బర్, వాషర్ మేన్, స్వీపర్, పెయింటర్, కార్పంటర్, ఎలక్ట్రీషియన్, మెయిల్, వెల్డర్, చార్జ్ మెకానిక్, ఎంపీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పదో తరగతి, తత్సమాన విద్యార్హత, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

2025 సంవత్సరం ఆగష్టు 1 నాటికి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం లభించనుంది. కనీసం 165 సెంటిమీటర్ల ఎత్తు, 78 – 83 సెంటిమీటర్ల ఛాతీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

వేర్వేరు పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.