AP: సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే ప్రజలు తమకు మంచి చేసిన ప్రభుత్వానికే పట్టం కడుతూ ఉంటారు. ఒకసారి ఓటమి పాలైన తర్వాత మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక గతంలో జరిగిన తప్పులు జరుపుకుండా పాలన కొనసాగించాలని భావిస్తారు. కానీ ఇటీవల రాజకీయాలలో మాత్రం పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే విధంగానే రాజకీయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో ఇదే తరహా రాజకీయాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసిపి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా కూటమినేతలు జైలుకు పంపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా అరెస్టు చేసిన వారందరూ తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం కోసమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గురించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ మిగతా నేతలు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ మరికొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని రేపు అధికారంలోకి వచ్చేది మేమేనని ఆ తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తారు అంటూ కూడా వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా ఇరువురి పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
ఇక 2029 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి రాడు, మేము రానీయము అని కూటమి అనుకుంటే పర్లేదు వారు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా సరిపోతుంది. అలా కాకుండా పొరపాటున 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలా ఉంటుందనేది ఊహించడానికి కష్టంగా ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. జగన్ ఏదైనా చెప్పాడంటే చేస్తాడు. మరి వచ్చే ఎన్నికలలో జగన్ గెలిస్తే కూటమినేతల పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
జగన్ గెలిచిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు అని ఎవరు మాట్లాడరు. అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు పోలీసులు మీడియా కూడా అదే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంది. మరి పొరపాటున జగన్ గెలిస్తే పరిస్థితి ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి ఈ ప్రశ్నలకు 2029 ఎన్నికల ఫలితాలే సమాధానంగా నిలుస్తాయని చెప్పాలి.
