విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఈసారి కూడా బాలికలదే పైచేయి!

శనివారం రోజు కొన్ని సాంకేతిక లోపం వల్ల విడుదల కావాల్సిన పదో తరగతి ఫలితాలు ఈరోజు కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదోతరగతి పరీక్షలు విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో కూడా బాలికలు ముందున్నారు.

70.70 శాతం బాలికలు, 64.02 శాతం బాలురలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదు అని అన్నారు. 797 పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. 78.03 శాతం ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక 49.07 శాతం అనంతపురం జిల్లా చివరిలో నిలిచింది. ఇక ఫెయిల్ అయిన వారికి వచ్చే నెల 6 నుంచి 15 మధ్య సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.