AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు మొత్తం విజయసాయిరెడ్డి రాజకీయ రాజీనామా గురించి చర్చలు జరుపుతున్నాయి. విజయ్ సాయి రెడ్డి వైకాపా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చూసుకోవడం దగ్గర నుంచి కూడా జగన్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈయనే చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా ఉంటున్నారు.
ఈ విధంగా వైకాపా పార్టీలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఈయన ఎవరు ఊహించని విధంగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాజకీయాలకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈయన రాజీనామా ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే విజయ్ సాయి రెడ్డి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సొంత చిన్నాన్నను చంపి జైలుకెళ్ళిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో నిన్న రాత్రి నుంచి ఎత్తులు పై ఎత్తులు వేయడం చూస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై కక్షకట్టి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అంటూ ఆయన పై విమర్శలు వర్షం కురిపించారు.
తన కుమారుడికి, తనకు సూట్ కేస్ కంపెనీలు, అక్రమ ఆస్తులు ఉన్నాయని, మనీ లాండరింగ్ చేశామని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడి, ఆర్వోసి, ఐటి లకు ఫిర్యాదు చేశాడని మండిపడ్డారు. విజయ్ సాయి రెడ్డి ఒత్తిడి కారణంగానే విచారణ జరిపి నా కుమారుడిని రెండు సంవత్సరాల పాటు జైలులో పెట్టారు అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు విషయంలో విచారణ జరిపిన అనంతరం కేసులను కొట్టివేసారని అప్పటి వరకు నా కొడుకు జైలులో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇక విజయ సాయి రెడ్డి ది తనది పక్కపక్క ఊర్లేనని తాము తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్నామని తెలిపాడు. విజయసాయిరెడ్డి, ఆయన తండ్రి, పినతండ్రీ కలిసి వాళ్ళ చిన్నాన్నను హత్య చేసి జైలుకు వెళ్లారు అంటూ సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.