AP: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అలజడి చెలరేగిందా అంటే అవుననే తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు కొన్ని నియమాలను పెట్టుకుని ఉంటాయి ఆ నియమాల అనుగుణంగా ముందుకు వెళితే ఏ విధమైనటువంటి అభిప్రాయ బేధాలు రావు కానీ గత కొద్ది రోజులుగా కూటమి పార్టీలో బేదాభిప్రాయాలు వచ్చినట్టు స్పష్టం అవుతుంది.
గత కొద్దిరోజులుగా కూటమి పార్టీలో డిప్యూటీ సీఎం వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు అయితే ఈ పదవి నుంచి ఆయనని తొలగించి ఈ పదవి నారా లోకేష్ కు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది అయితే ఈ డిమాండ్ పట్ల పలువురు జనసేన నాయకులు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఆసక్తి కరమైన విషయాలను తెలిపారు.
మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు అని తెలిపారు చంద్రబాబు నాయుడు కూడా మెగా బ్రదర్ అంటూ కిరణ్ చెప్పుకు వచ్చారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని తెలుగుదేశం కేడర్ కోరుకోవడంలో తప్పులేదు. మేము కూడా గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్ళారో అదే కోనసాగిస్తే మంచిది…అనవసరంగా వైసిపి నేతలకు మాటలకు ఊపిరి పోయకండని వార్నింగ్ ఇచ్చారు.
ఇలా కూటమి పార్టీలో భేదాభిప్రాయాలు వస్తే అది వైసీపీకి మంచి అస్త్రంగా మారుతుంది వారికి ఛాన్స్ ఇవ్వద్దని తెలిపారు. ఇప్పటికే కొంతమంది వైసిపి నాయకులు జోబులో మైకులను పెట్టుకుని తిరుగుతున్నారని కిరణ్ రాయల్ తెలిపారు. చిరంజీవితో కన్నా చంద్ర బాబు తోనే ఎక్కువ జర్నీ చేస్తున్నాము..పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారని గుర్తు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్స్ తిరుగుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ దేశానికి ఎంతో అవసరమైన నాయకుడని తనకు మరింత భద్రత కల్పించాలని కిరణ్ రాయల్ కోరారు.