AP: ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్ పరిస్థితి ఏంటి అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటూ జగన్ గురించి విమర్శలు చేశారు అంతేకాకుండా జగన్ మాట్లాడితే తనకు కామెడీగా ఉంటుందని నవ్వొస్తుందని ఈయన తెలిపారు.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. నాగబాబు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మీ అన్న చిరంజీవి ముగ్గురు కూడా రాజకీయాలలోకి వచ్చారు. మీ అన్న తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి ఎలాగో మంత్రి అయ్యారు. ఇక మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 16 సంవత్సరాలకు అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక మీరు మీ తమ్ముడు పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయ్యారు. ఇంతవరకు బానే ఉంది కానీ మీరు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకోవడమే ఏమాత్రం బాలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి సింగిల్ గా పోటీ చేస్తూ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. తన తండ్రి రాజశేఖరరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అపజయం ఎరుగని నాయకులు.వాళ్లతో పోల్చుకుంటారేంటి.
ఇంకో ఆయన మరో మాట అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కొడుకు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? అన్నాడు. అసలు మీ అన్న చిరంజీవి హీరో కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చిన తరువాతనే చిరంజీవి స్టార్ హీరో అయ్యారు ఆయన పేరు పట్టుకొని నువ్వు నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. మరి చిరంజీవి లేకపోతే మీ పరిస్థితి ఏంటో గమనించాలని నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు.