AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అవుతుంది అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు విషయంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఇలా సంక్షేమ పథకాలను పక్కన పెట్టడమే కాకుండా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేకపోవడంతో నిరుద్యోగులలో కూడా కూటమి సర్కారు పై వ్యతిరేకత ఏర్పడుతోంది.
ఇలాంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వానికి షాక్ ఇస్తూ వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది విసుగు చెంది ఆదివారం వైయస్ఆర్‌సీపీలో చేరికలు మొదలయ్యాయి. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సమక్షంలో ఈ 30 మంది పార్టీ కండువా కప్పుకొని వైసీపీలోకి చేరారు.
ఇలా వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్ అనంతరం మాట్లాడుతూ… కూటమిపాలన సొంత నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల సమక్షంలోనే బయటపెడతాం అంటూ జోగి రమేష్ తెలిపారు. ఇలా ఒక ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతోంది.