AP: ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే ఈ మీటింగ్ లో భాగంగా పేదలందరికీ కూడా స్థలంతో పాటు అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కూడా చేపడతామని మంత్రి వర్గం మండలి చర్చించింది అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇచ్చిన ఇల్లు పట్టాలను రద్దు చేస్తూ వాటిని తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా పేదవారికి పక్కా ఇల్లు పథకంతో అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయిస్తూ ఇల్లు పట్టాలు మంజూరు చేశారు.
ఇక కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున పేదలు ఇల్లు కట్టుకొని అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చారు దీంతో ప్రజలందరూ కూడా జగనన్న కాలనీలుగా పెట్టుకున్న ఆ పేర్లను కాస్త ఎన్టీఆర్ కాలనీలుగా చంద్రబాబు నాయుడు మార్చేశారు. ఇప్పుడు పట్టా అందుకొని ఇల్లు కట్టుకోకుండా ఉన్నవారి స్థలాలను వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తుంది.
ఇలా ఇల్లు పట్టాలు కనుక వెనక్కి తీసుకుంటే బాబుకు చిక్కులు తప్పవని చెప్పాలి. ఇదే విషయం గురించి వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లా పట్టాలను రద్దు చేసే హక్కు చంద్రబాబు నాయుడుకు లేదని తెలిపారు. ఒకవేళ చంద్రబాబు మూర్ఖంగా ముందుకెళితే వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సుధాకర్ బాబు పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా పేదవారి గురించి ఆలోచించి వారికి సెంటు భూమి ఇవ్వలేదు కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఇచ్చిన స్థలాన్ని కూడా వెనక్కి లాగే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.