ఇప్పటికీ తెలుగులో అత్యధిక పారితోషకం అందుకునే హీరోయిన్లలో అనుష్క పేరే మొదటగా ఉంటుంది. అంతటి స్టార్ డమ్ ఉంది ఆమెకు. కానీ దాన్ని క్యాష్ చేసుకోవడం మీద స్వీటీ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ‘బాహుబలి’ తరువాత అనుష్క సినిమాలను బాగా తగ్గించేసింది. ఏడాదికో ఏడాదిన్నరకో ఒక సినిమా చేస్తోంది. ఇదే నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. ఆమెతో సినిమాలు చేయాలని చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. భారీ పారితోషకం ఆఫర్ చేస్తున్నారు. కానీ అనుష్క మాత్రం వారిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ అధికారికంగా ఆమె సైన్ చేసింది యువీ క్రియేషన్స్ సినిమా మాత్రమే.
అది మొదలుకావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఈలోపు ఆమెకు ఇంకొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల బడా ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆమెతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ముందుకొచ్చిందని వినికిడి. అది కూడ ఒక పెద్ద దర్శకుడితోనే అని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కూడ పెద్దదేనట. కథ, దర్శకుడు, నిర్మాత అందరూ సిద్ధంగా ఉన్నారు. స్వీటీ నుండి ఓకే అనే మాట రావడమే ఆలస్యం. కానీ స్వీటీ ఓకే చెప్పట్లేదు. అంత పెద్ద ఆఫర్ వచ్చినా చేసేది చేయనిది తేల్చట్లేదట. ఇది నిర్మాతలకు చికాకు కలిగించే విషయమే. ఇలాగే అనుష్క నాన్చుతూ పోతే నిర్మాతలు ఆమెను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది.