అనుష్క పెళ్ళి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?

తామిద్దరూ మంచి మిత్రులమని అనేక సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ కొందరు మాత్రం వాళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందనే వార్తలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. అనుష్క, ప్రభాస్. తాజాగా అనుష్క పెళ్లి వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే గుజరాత్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగబోతుందని గత మూడు నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవన్నీ నిజం కాదని అనుష్క కూడా పలు మార్లు చెప్పింది. తాను వివాహం చేసుకుంటే కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని కూడా చెప్పింది.

ఇక తాజాగా అరుంధతి చిత్రంతో సౌత్ ఇండియాలోనే ఓ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది జేజమ్మ. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమెకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే అంతగా ఆమె పెళ్లి గురించి కూడా అంత చర్చనీయాంశం అవుతోంది. ఇకపోతే బాహుబలితో ప్రత్యేక స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్ని ప్రత్యేకమైన పాత్రలు మాత్రమే చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా అనుష్క వయసు ప్రస్తుతం 38ఏళ్లు. అయినా పెళ్లి చేసుకోవట్లేదనే ప్రశ్న ఆమె ఎక్కడికెళ్లినా వెంటాడేదే. కానీ పెళ్లి అనేది ఆమె వ్యక్తిగతం. తన నిర్ణయం ప్రకారం చేసుకుంటానని ఇప్పటికే చాలాసార్లు ఘాటుగా కూడా స్పందించారు అనుష్క.

తాజాగా ఆమె పెళ్లిపై మరో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సారి ప్రభాస్ కాదు. కొత్తగా ఓ క్రికెటర్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే టీమిండియాలో ఉన్న ఓ క్రికెటర్‌తో ఆమె అతనితో ప్రేమలో ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అతని పేరు మాత్రం బయటకు రావడం లేదు. కానీ అతను నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కాదు. ప్రస్తుతం అనుష్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.