మామూలుగా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం అన్నది సహజం. అయితే వృద్ధాప్యాన్ని నివారించడం కోసం చాలామంది ఫేషియల్స్ , బోటాక్స్ వంటివి చేస్తుంటారు. కానీ అవి చర్మానికి అంతగా ఉపయోగపడవు. సమతుల్య ఆహారం, ఆర్ద్రీకరణ, ఆరోగ్యకరమైన జీవనశైలి చర్మం వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. అయితే వృద్ధాప్య చాయలు దగ్గర పడుతున్న నిత్య యవ్వనంగా చర్మంపై ముడతలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాలి. సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి.
వీటిని రోజూ వారి ఆహారంలో తింటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏంటి అన్న విషయానికి వస్తే.. బ్లూబెర్రీ చర్మ సంరక్షణకు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ధర ఎక్కువైనా రోజూ ఆవకాడో తినాల్సిందే. ఈ పండులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి పెంచుతుంది. అవకాడో తినడం వల్ల చర్మం ఎప్పటికీ మెరుస్తూ ఉంటుంది.
ఎండ నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. సన్‌స్క్రీన్‌తో పాటు, దానిమ్మ పండ్లు కూడా తినాలి. ఇవి చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అనేక చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. అదేవిధంగా బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ లు ఉంటాయి. ఇవి చర్మాన్ని అనేక విధాలుగా సంరక్షిస్తాయి. ఈ పండు తినడంతో పాటు పండు గుజ్జుతో చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పండిన బొప్పాయి చర్మంపై సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. రంధ్రాల్లో పేరుకుపోయిన మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.