Rajini and Nelson : ఇన్సైడ్ టాక్ : రజినీ భారీ సినిమాలో ఈ యంగ్ స్టార్ హీరో ఇంపార్టెంట్ రోల్.?

Rajini and Nelson :  మన సౌత్ నుంచి అసలు సిసలు ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అని చెప్పాలి. అలాగే ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా రజినీ కి ఉన్న క్రేజ్ అనన్య సామాన్యం. ఒక్కటి సరైన కథతో గాని హిట్ పడితే దాని రిజల్ట్ కోసం ప్రపంచం అంతా మాట్లాడుతుంది.
ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న రజినీ ఇప్పుడు కాస్త బ్యాడ్ టైం లో ఉన్నారు. దీనితో తన నుంచి తన మార్క్ భారీ హిట్ అందుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అది కోలీవుడ్ హిట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో అయినా నెరవేరుతుందో ఏమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాని భారీ లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా తాజాగా తమిళ సినీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో రజినీతో పాటు అక్కడి ఒక యంగ్ స్టార్ హీరో అయినటువంటి శివ కార్తికేయన్ కూడా కీలక పాత్ర చేస్తున్నట్టు వినిపిస్తుంది.
ఇది వరకే ఈ యంగ్ హీరోతో ఈ దర్శకుడు “వరుణ్ డాక్టర్” అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇపుడు రజిని సినిమాలో మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ కోసం చూస్తున్నట్టు టాక్ సర్వత్రా ఆసక్తిగా మారింది. దీనితో ఈ టాక్ పై అభిమానులు ఒక క్లారిటీ కోసం కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అదివ్వనున్నాడు.