ఈఎస్ ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. షరతులతో కూడిన బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. 70 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న ఆయనకు చివరికి ఊరట దక్కింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు పలు ఆసుపత్రుల్లో వైద్యం పొందిన అచ్చెన్న ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం దరఖాస్తు చేయగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అయితే రెవడసారి మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా….దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధి లోద్ర, హైకోర్టు సీవియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు అచ్చెన్న ఆరోగ్యంపై ప్రధానంగా వాదనలు వినిపించారు.
అనంతరం కోర్టు మూడు రోజులు తీర్పును రిజర్వ్ లో పెట్టగా శుక్రవారమే షరత్తులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. 2 లక్షలు పూచికత్తు..కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లోద్దని ఆదేశాలిచ్చింది. అలాగే సాక్షాలు తారుమారు చేయోద్దని, దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. బెయిల్ మంజూరుతో టీడీపీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసారు.70 రోజులుగా జైళ్లు, కోర్టు, ఆసుపత్రులు, విచారణలంటూ అచ్చెన్నాయుడు నలిగిపోయారు. ఈ నేపథ్యంలో చికిత్స అనంతనం అచ్చెన్న నేరుగా స్వగ్రామానికి చేరుకోనున్నారు.
అనంతరం కేసుకు సంబంధించి బయటపడే విషయమై లాయర్లతో సంప్రదింపులు జరపనున్నారు. మరో వైపు ఎప్పటికప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అచ్చెన్నను ఏసీబీ అధికారులు విచారించినా..ఆయన నుంచి సరైన ఆధారాలు గానీ, సమచారం గానీ రాబట్టలేక పోయారు. ఈ నేపథ్యంలో అచ్చెన్న మనసు విప్పి తమ ప్రశ్నలకి సమాదనాలివ్వలేదని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నను మరోసారి ఏసీబీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ అధికారులు అలాంటి చర్యలకు పూనుకున్నట్లు లేదు.