ఇండస్ట్రీ టాక్ : రామ్ చరణ్ తో ఆ నందమూరి హీరో దర్శకుడు.?

గత కొన్ని రోజులు నుంచి కూడా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ కి సంబంధించి పలు వార్తలు అయితే మంచి ఆసక్తిగా మారాయి. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు గౌతమ్ తిన్ననురితో ప్లాన్ చేసిన భారీ చిత్రం ఆగిపోయినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ చిత్రం ఆగిపోవడంతో రామ్ చరణ్ లైనప్ లో మరింత మంది స్టార్ దర్శకుల పేర్లు బయటకి రాగా ఇప్పుడు మరో కొత్త దర్శకుని పేరు కూడా యాడ్ అయ్యినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ స్టార్ట్ అయ్యింది.

మరి ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి భారీ హిట్ ఇచ్చిన “బింబిసార” దర్శకుడు వసిష్ఠ రామ్ చరణ్ తో వర్క్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఇంకా ఎంత వరకు నిజముందో కానీ ప్రస్తుతం అయితే ఈ టాక్ బయటకొచ్చి వైరల్ గా మారింది.

ఆల్రెడీ ఈ దర్శకుడు బింబిసార సినిమాని మరో భాగం కూడా అనౌన్స్ చేసాడు కానీ అది వచ్చేందుకు చాలా సమయం పట్టొచ్చు. మరి నిజంగానే ఈ కాంబోలో సినిమా పడిందా లేదా అనేది మరికొన్నాళ్లు ఆగి చూడాలి. ప్రస్తుతం అయితే రామ్ చరణ్ భారీ సినిమాల దర్శకుడు శంకర్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.