Mega Family: మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన లేదా ఏ చిన్న పండుగ జరిగిన ఒకే చోట కలిసి కనువిందు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో మెగా కుటుంబ సభ్యులు కలిసి కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. మెగా కుటుంబ సభ్యులందరూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వచ్చిన సంక్రాంతి పండుగలో ఒకే చోట అందరూ కలిసి సందడి చేశారు.. ఇక ఇటీవల కాలంలో మెగా కుటుంబ సభ్యులు ఒకేచోట కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఎన్నో ఊహగానాలకు తెరతీస్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలోనే మెగా కుటుంబంలో శుభకార్యం జరగబోతున్న సంగతి తెలిసిందే. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ తరుణంలోనే లావణ్య శ్రీమంతపు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల లావణ్యకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే లావణ్య త్రిపాటి శ్రీమంతం కంటే కూడా మెగా కుటుంబంలో మరొక వేడుక ముందుగా జరగబోతుందని తెలుస్తోంది.
లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీకి ఒక చిన్న పార్టీ ఇవ్వాలని భావించారట కానీ ఇప్పటివరకు అది కుదరలేదని అందుకే శ్రీమంతానికంటే ముందుగానే మెగా ఫ్యామిలీ అందరిని ఒకే చోట చేర్చి ఘనంగా పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వేడుక మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఇలా లావణ్య పుణ్యమో అని మరోసారి మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ అయిన తర్వాతనే లావణ్య త్రిపాటి సీమంతపు వేడుకలను కూడా నిర్వహించాలని భావించినట్టు తెలుస్తుంది. ఇక శ్రీమంతపు వేడుకకు సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారని, చాలా సాంప్రదాయ బద్ధంగా ఈ వేడుకను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
