2019 ఎన్నికల్లో రోజా గెలిచిన మంత్రి వర్గంలో చోటు దక్కని సంగతి తెలిసిందే. కాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా రోజా మంత్రి కాలేకపోయారు. దీంతో రోజాకి పార్టీలో జగన్ అంత వెయిట్ ఇవ్వలేదని.. సినిమా నటి కావడంగానే రోజాని దూరం పెట్టినట్లు రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే ఆ తర్వాతి రోజుల్లో ఆ కామెంట్లకు ధీటుగా పార్టీలో మంత్రి సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టి జగన్ నెత్తిన పెట్టుకున్నారని నిరూపించారు. జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రోజా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తే ఫైర్ బ్రాండ్ లా రోజు దూసుకొస్తారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో షూటింగ్ లకు ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల నుంచి నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని అమలు పరుస్తున్నారు. అయితే వీటన్నింటికి సంబంధించి జగన్ ఓ కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ ప్రస్తుతానికి జగన్ వద్దేనే ఉంది. ఆ పదవికి ఎవర్నీ ఎంపిక చేయలేదు. అయితే తాత్కాలికంగా సినిమా వాళ్లకు-టాలీవుడ్ కి వారధిగా ఏర్పాటు కాబోయే కొత్త కమిటీ ఛీప్ గా రోజాని ఎంపిక నిమయిస్తున్నట్లు సమాచారం.
రోజా ఆ పదవిలోకి వస్తే ఆమె కింద ఓ ఐఏఎస్ అధికారి కూడా నియమిస్తారుట. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? దర్శక, నిర్మాతలు, హీరోలు ఏదైనా షూటింగ్ నిమిత్తం అనుమతి కావాలంటే ప్రభుత్వం తరుపున రోజా ఛీప్ గా ఉండే కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. అక్కడ నుంచి రోజా సంతకం కాగానే సినిమా వాళ్లకు కావాల్సిన అనుమతులు దక్కినట్లేనట. ఇదంతా చూస్తుంటే రోజా చేతిలో సినిమాటోగ్రఫీ శాఖను పెట్టినట్లు అనిపిస్తోంది. ఇక విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్దికి జగన్ సర్కార్ మొగ్గు చూపుతోంది.ఇప్పుడు విశాఖ పరిపాలన రాజాధానిగా కూడా అవతరించడంతో సినిమా ఇండస్ర్టీ మరింత వేగంగా అభివృద్ది చెందనుందని తెలుస్తోంది.
