ఈ మధ్య కాలంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికి తాళం వేసుకున్నారేమో అనే అనుమానాలు చాల మందికి కలిగాయట.. ఎందుకంటే ఎంతో దూకుడుగా కనిపించే అనిల్ కుమార్ కాస్త కూల్‌గా ఉంటున్నాడు.. సైలెంట్ అయ్యారు.. కానీ ప్రస్తుతం మాత్రం టీడీపీ చంద్రబాబుపై విరుచుకు పడ్డాడు.. దీనికి కారణం ఉందండోయ్.. అదేమంటే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న నేపధ్యంలో లోకేష్, చంద్రబాబు, పర్యాటకుల మాదిరిగా ఏపీకి వస్తూ పోతున్నారని, ఇప్పటికే కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్నది.. ఏ సమయంలో అయినా ఊహించని ప్రమాదం సంభవించవచ్చూ.. అందుకే అయ్యా చంద్రబాబు నాయుడు గారు కరకట్టపై నిర్మించిన మీ అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని నోరు తెరచి హితబోధ చేశారు..
ఇకపోతే ఏపీని వర్షాలు ముంచెత్తుతున్న నేపధ్యంలో అక్రమంగా కరకట్ట మీద ఇళ్ళు కట్టుకున్న మీరు ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరైనది కాదని పేర్కొన్నారు.. మీ హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదని, మీ పాలనలో కరువు తాండవించిందని, తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ముందు ఖాళీ అవుతున్న మీ పార్టీని కాపాడుకోండి.. ఆ తర్వాత తీరిగ్గా విమర్శలు చేద్దురు గాని అని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్..
అంతే కాకుండా ఉన్న 23 ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేక పోతున్నారు. కరకట్టపై ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన పట్టించుకోవడం లేదు.. వరద తగ్గిందని హైదరాబాద్ నుంచి కరకట్టకు వచ్చి.. జూమ్ బరాబర్ జూమ్ అంటూ.. చిందులు తొక్కితే మాత్రం మునగడం ఖాయం అంటు తెలియచేశారు.. ఏది ఏమైన రాజకీయాల్లో రాటుదేలిన బాబుగారికి ప్రత్యేకంగా ఏ విషయం చెప్పవలసిన అవసరం లేదనుకుంటూ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటారు.. మరి ఈ విషయంలో ఇళ్లు ఖాళీ చేస్తారో వరద ప్రవాహంలో మునగ గొట్టుకుంటారో ఆయన ఇష్టం అని అనుకుంటున్నారట..