కేసీఆర్ ను కాపాడుకున్న సీమాంధ్రులు.. జగన్ హస్తం ఎంతవరకు

trs party

 గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు సుతిమెత్తని దెబ్బ కొట్టారు ఓటర్లు, తెలంగాణలో మాకు తిరుగేలేదని విర్రవీగుతున్న గులాబీ పార్టీకి హెచ్చరికలు జారీచేశారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కేవలం 55 స్థానాలకే తెరాస పార్టీని పరిమితం చేసారు, పరిమితం చేశారనే దానికంటే 55 స్థానాల్లో గెలిపించారని చెప్పుకోవటం సబబు.

trs party

 తెరాస గెలిచిన డివిజన్స్ పరిధిలో మెజారిటీ ఓట్లు సీమాంధ్రులవే, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 37 స్థానాలకు గాను 32 స్థానాలు టీఆర్ఎస్‌కు ద‌క్కాయి. వీటిలో కూడా ప్ర‌ధానంగా శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 26 డివిజ‌న్ల‌కు 23 స్థానాలు టీఆర్ఎస్‌కు ద‌క్కాయి. ఈ ప్రాంతాల్లో సీమాంధ్ర ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.

 గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఒక్క డివిజ‌న్‌ కూడా తెరాస గెలుచుకోలేకపోయింది. నిజనికి గ్రేటర్ పరిధిలో ఒక్క ఎంపీ ఒక ఎమ్మెల్యే తప్ప బీజేపీకి పెద్దగా బలం లేదు, కానీ ఈ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాలు గెలిచే సత్తా వచ్చిందంటే దానికి కారణం తెలంగాణ ప్రజల్లో తెరాస మీద వున్నా వ్యతిరేకతే అని చెప్పాలి. గ్రేటర్ పరిధిలోని తెలంగాణ ఓటర్లు అందరు నిర్మొహమాటంగా కారును షెడ్డు కు పంపించాలని భావించారు.

 ఇలాంటి సమయంలో సీమాంధ్రులు కేసీఆర్ ను అక్కున చేర్చుకున్నారు, ఇదే సీమాంధ్రులను గతంలో దొంగలు, దోపిడిదారుల‌ని హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రోళ్ళ పిల్లలకు తామెందుకు ఫీజు కట్టాలని,సంక్రాంతికి ఊళ్ళకు వెళ్ళిన ఆంధ్రోళ్లను తిరిగి రానివ్వమ‌ని అనేక పర్యాయాలు తెరాస నేతలు, అగ్రనేతలు హెచ్చ‌రించారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేద‌ని, ఆంధ్రోళ్ళ పీడ విరగడ కాలేదని దూషించారు. ఇంత దారుణంగా తిట్టినా, సిగ్గులేద‌ని అవ‌మానించినా …అవేవీ మ‌న‌సులో పెట్టుకోకుండా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఆద‌రించి, త‌మ గొప్ప‌మ‌న‌సును సీమాంధ్రులు చాటుకున్నారు.

 ఇదే సమయంలో వైసీపీ అభిమానులు సైతం కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ అభిమానులు బీజేపీకి ఘోరంగా ట్రోల్ల్స్ చేయటం స్టార్ట్ చేశారు , గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని భావించిన వైసీపీ సానుభూతి పరులు తెరాస కు మద్దతు ప్రకటించి కేసీఆర్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు.