రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎక్కువగా అన్యాయం అవుతున్న రాష్ట్రం ఏపీ అనే వాదన బలంగా ఉంది.. ఇప్పటికి ఏపీ ఆర్ధికంగా ఎన్నో కష్టాలు, నష్టాలు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణాకు భాగ్యనగరం ఎలా ఉందో అలాగే ఏపీలో రాజధానిని కట్టి చూపిస్తామని ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వడమే కాదు, ప్రత్యేక హోదా అంటూ తీయని కబుర్లు కూడా చెప్పారు. కానీ చివరికి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది.. ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారాయి. రాజధాని విషయం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ లోపల కరోనా వచ్చి విషపు కాటు వేసింది.. మరో వైపు చూస్తే సీజనల్ గా వచ్చే తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ అల్లల్లాడుతోంది. దీని వల్ల వేల కోట్ల రూపాయల అతి భారీ నష్టమే సంభవించింది.
ఇక కేంద్ర సాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదట. ఇకపోతే ప్రతి సారీ వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్ గురించే అంతా మాట్లాడుకునేవారు. కానీ ఇపుడు మాత్రం హైదరాబాద్ గురించే చర్చ నడుస్తుంది.. నగరాన్ని వరదలు వచ్చి ముంచేశాయనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.. దీనికి కారణం ప్రభుత్వాల వైఫల్యం అని అంటుండగా అక్రమంగా చెరువులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పాపానికి ఇది ప్రతిఫలం.. అప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలా బాధపడే పరిస్దితులు వచ్చేవి కాదట అనే వారు కూడా ఉన్నారు.. మొత్తానికి ఏం జరిగిన హైదరాబాద్ వరదలతో సామాన్యుడు మాత్రం మునిగాడు, ఇది జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. అందుకే ఎపుడూ ఏడ్చే ఆంధ్రప్రదేశ్ బాధ ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా పోయింది..
ఇకపోతే ఏపీలో ఎన్ని నష్టాలు జరిగిన స్పందించని టాలీవుడ్ చిత్రపరిశ్రమ తెలంగాణకు మాత్రమే విరాళాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారట.. దీనికి కారణం లేకపోలేదు.. అదేమంటే టాలీవుడ్ ప్రముఖులు మొత్తానికి మొత్తం ఆంధ్రా మూలాలు ఉన్న వారే కానీ స్థిరపడింది మాత్రం తెలంగాణాలో, దాంతో మొహమాటాలు, అవసరాలు ఇవన్నీ కలసి సినీ పెద్దల నోట జై టీఆర్ఎస్ అని తరచూ వినిపిస్తుంది.. కానీ ఆంధ్రా విషయంలో మాత్రం ఫక్త్ రాజకీయమే నడుపుతున్నారు. ఇదిలా ఉండగా సినీ పెద్దల్లో టీడీపీ సామాజికవర్గం వారు అత్యధికులు. అలాగే మరో కొత్త పార్టీకి చెందిన వారు కూడా అప్పర్ హ్యాండ్ గా ఉన్నారు. దాంతో ఏపీకి పైసా సాయం చేయాలన్నా ఈ రాజకీయ లెక్కలేవో అడ్డు వస్తున్నాయిలా ఉంది.
దాంతో కేవలం ఇది ఇవాల్టి కధ కాదు, కరోనా సమయంలో కూడా మన వెండితెర వేలుపులు ఇలాగే చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనిబట్టి అర్ధం అయ్యేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏపీకీ సపోర్ట్‌గా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటపట్టడం ఖాయమనే భావన ఆంధ్రుల్లో కలుగుతుందట.. ఇక కడుపు మండుతున్న కొందరు ఏపీని నిలువున ముంచుతున్నది వీరే అని నసుగుతున్నారట.. ఎవరు ఏమనుకున్న ఏపీకి వచ్చినన్ని కష్టాలు తెలంగాణాకు లేవనే చెప్పాలి.. తెలంగాణ పాలకుల వల్ల ఈ రాష్ట్రం నాశనం అవుతుందన్నది నిజమంటున్నారు..