గుంటూరు అర్బన్ జిల్లా పల్నాడులో ఒక 13 ఏళ్ల బాలిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం తన తల్లి కరోనా బారిన పడి మరణించింది. ఆ బాలికకు కూడా కరోనా సోకడంతో తన తల్లితో పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుని నెగిటివ్ వచ్చి ఇంటికి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆ బాలిక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేది. ఆ బాలిక తండ్రి ఫ్యాక్టరీలో వాచ్ మెన్ గా పని చేసేవాడు. దీంతో ఆ బాలిక తండ్రి ఆ బాలిక గురించి బాగోగులను పట్టించుకునే వాడు కాదు.
దీనినే ఆసరాగా తీసుకున్న స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఒక మహిళ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్ళింది. ఆ బాలికను తీసుకెళ్లిన తర్వాత కొద్ది రోజులకు వ్యభిచారం చేయాలని బాలిక పై తీవ్రస్థాయిలో ఒత్తిడిని తీసుకువచ్చింది. ఆ పని చేయడం తనకు ఇష్టం లేదని బాలికలు ఇంట్లోనే బంధించి ఆ బాలికకు చిత్రహింసలు పెట్టింది. కొన్నాళ్లపాటు ఆ మహిళ బాలికతో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ తీసుకెళ్ళి వ్యభిచారం చేయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆ బాలిక అనారోగ్యం పాలవడంతో వ్యభిచార నిర్వాహకులు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో రెండు రోజుల క్రితం ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు.
ఆ బాలిక తండ్రి తన కూతురు కనిపించలేదని నల్లపాడు పోలీసులకు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశాడు. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియడంతో నల్లపాడు పోలీసులు కేసు ను క్లోజ్ చేశారు. అయితే రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలిస్తే అదుపులోకి తీసుకోకుండా ఇన్నాళ్ల పాటు దీనిని ఎందుకు గోప్యంగా ఉంచారు? ఆ బాలిక రెండు నెలలపాటు ఎవరి దగ్గర ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ బాలికను మహిళకు సదరు తండ్రి అప్పగించారా? దీని వెనుక ఏమైనా రాయబారాలు జరిగాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులు వ్యభిచారం చేయిస్తారని ధ్రువీకరించుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి బాగోలేదు. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు.