సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఇక అంతే

andhra pradesh cm jagan mohan reddy meeting on corruption eradication

గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో అవినీతి తిమింగళాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి… క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

andhra pradesh cm jagan mohan reddy meeting on corruption eradication
andhra pradesh cm jagan mohan reddy meeting on corruption eradication

ఈ సమీక్షలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్నీ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్, ఏసీబీ డీజీ పీఎస్సార్ తదితరులు హాజరయ్యారు.

కీలక నిర్ణయాలు ఇవే

అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలోనే చర్యలు

దిశ తరహాలో అసెంబ్లీలో బిల్లు

1902 నెంబర్ కు వచ్చే అవినీతి సంబంధిత కాల్స్ ఏసీబీ నెంబర్ 14400 కు బదలాయింపు

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదుల అనుసంధానం

ఎమ్మార్వో, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో జరిగే అవినీతిపై ప్రత్యేక దృష్టి

ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్

టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందే.

కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ