Andaman and Nicobar: 100% వాక్సినేషన్ పూర్తి చేసిన రెండో రాష్ట్రంగా “అండమాన్ నికోబార్”

Andaman and Nicobar achieved 100% Covid vaccine coverage

Andaman and Nicobar: కరోనా మహమ్మారిని ఎదుర్కోటానికి చేతిలో ఉన్న ఆయధం ప్రస్తుతానికి టీకా మాత్రమే. భారత ప్రభుత్వం వాక్సినేషన్ పక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళుతుంది. ఈ క్రమంలో అండమాన్ మరియు నికోబార్ దీవులలో అర్హులైన వారందరికీ 100 శాతం డబుల్ డోస్ COVID వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లుగా అక్కడి ప్రభుత్వం తాజాగా ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీంతో ఇదివరకే ఈ ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తర్వాత అండమాన్ నికోబార్ దీవులు నిలిచాయి.

కేవలం కోవిషీల్డ్‌ వాక్సిన్ ని ఉపయోగించి ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రం అని A&N ప్రభుత్వం చెప్తుంది. కఠినమైన సముద్రం ప్రాంతం, అత్యంత దట్టమైన అడవి, కొండలు మరియు ప్రతికూల వాతావరణంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు 800 కి.మీల మేర విస్తరించి ఉన్న 836 ద్వీపాలలో వాక్సినేషన్ పక్రియ పూర్తి చేశామని తెలిపింది. దీవుల మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందినట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయిన రోజునే A&N లో కూడా స్టార్ట్ అయ్యింది. ఇక దేశం విషయానికొస్తే డిసెంబర్ 31 నాటికి 94 కోట్ల మంది వయోజనులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 82.6 కోట్ల మందికి మొదటి డోస్ ఇవ్వగా, 54.1 కోట్ల మందికి రెండు డోసులు అందించినట్లుగా సమాచారం. డిసెంబర్ నెలలో ఇంకా రెండు వరాలు మాత్రమే ఉండడంతో కేంద్రం తన లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.