Cash: గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలలో క్యాష్ కూడా ఒకటి. ఈ షో కి సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ షోలో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీలకు సుమ ఫన్నీ టాస్క్ లు ఆడించి ఫన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఈ షో బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఈ క్యాష్ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది . సాధారణంగా సినిమాలు సీరియల్స్ టీవీ షోస్ షూటింగ్స్ జరిగే సమయంలో వాటిని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇటీవల సుమ క్యాష్ షో షూటింగ్ ఎలా చేస్తారని ఒక వీడియో తీసి షేర్ చేసింది.
సుమ కనకాల టీవీ షోలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉండే సుమ ఇటీవల యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ఈ ఛానల్ ద్వారా సుమ అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అతి తక్కువ కాలంలోనే నాలుగు లక్షలకు పైగా సబ్ స్క్రైబర్ లను సొంతం చేసుకుంది. సుమ తన ఛానల్ ద్వారా క్యాష్ ప్రోగ్రాం షూటింగ్ కి సంబంధించిన మీడియా ఇటీవల షేర్ చేసింది.
ఈ వీడియోలో సుమ ఉదయ 6:30 లేచి పూజ కార్యక్రమాలు ముగించుకొని క్యాష్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళింది. అక్కడ తన మేకప్, డ్రస్సింగ్, ఫోటో షూట్ గురించి వివరించింది. అంతే కాకుండా క్యాష్ షో సెట్ మీద వారు ఎలా చేస్తారు అన్న విషయాల గురించి కూడా సుమ వివరించింది. తన ఛానల్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.