మ.. మ మహేషా అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన యాంకర్ శ్యామల!

యాంకర్ శ్యామల ఈ పేరు గురించి అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటిగా అనంతరం యాంకర్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో శ్యామల బుల్లితెర సీరియల్స్లో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు. అయితే ప్రస్తుతం ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ బుల్లితెర కార్యక్రమాలకు అలాగే సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిజీగా ఉన్నారు.ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న శ్యామల సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వీడియోల ద్వారా అందరికీ తెలియ చేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే శ్యామల నిత్యం డాన్స్ వీడియోలను, తన క్యూట్, గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే, ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఇకపోతే తాజాగా ఈమె మహేష్ బాబు పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ రచ్చ చేశారు.

తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలోని మ..మ మహేషా అనే పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక డాన్స్ వీడియోలతో శ్యామల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.