వెబ్ సీరీస్ కోసం అనసూయ కొత్త ప్రయత్నం.. మొదటిసారిగా వేశ్య పాత్రలో..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనసూయ బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షో లకి యాంకరింగ్ చేయటమే కాకుండా వెండితెర మీద కూడా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ మొదటిసారి నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించింది.

ఆ సినిమా తర్వాత క్షణం సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి రంగమ్మత్తగా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో దాక్షాయిని అనే ఒక వైవిద్యమైన పాత్రలో నటించింది. అంతేకాకుండా అనసూయ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి అందరిని మెప్పించింది. ఇలా బుల్లితెర మీద టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే వరుస సినిమాలలో నటిస్తూ అనసూయ బిజీగా ఉంది.

ఇలా టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో చేసే రచ్చ అంతా కాదు. ప్రస్తుతం అనసూయ ఇలా బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తాజాగా అనసూయ ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ క్రిష్ నిర్మించబోతున్న “కన్యాశుల్కం” అనే వెబ్ సిరీస్ లో అనసూయ ఒక వేశ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ సీరియస్ మొత్తం అనసూయ పాత్ర చుట్టే తిరుగుతుందనిసమాచారం. ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలని ఎన్నుకునే అనసూయ ఈ వెబ్ సిరీస్ కోసం మరొక కొత్త ప్రయత్నం చేస్తోంది.