Anasuya: అనసూయ భరద్వాజ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.15 మే 1985న జన్మించిన అనసూయ హైదరాబాద్‌లోని భద్రుక కాలేజీ నుంచి 2008లో ఎంబీఏ పట్టా పొందారు అనసూయ. చదువు తర్వాత కొన్నాళ్లు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు పాపులర్ న్యూస్ ఛానెల్ సాక్షిలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.
ఇలా న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న అనసూయ కాలేజీ చదువుతున్న సమయంలోనే నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఇక న్యూస్ రీడర్గా పనిచేస్తున్న అనసూయ మా మ్యూజిక్ వంటి ఛానల్ లకు యాంకర్ గా వ్యవహరించారు. ఇకపోతే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అనసూయకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే ఈమెకు రంగస్థలం సినిమా ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఈ సినిమాలో గుర్తింపు పొందిన అనసూయ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆదరణ పొందారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నా ఈమె భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా అనసూయ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు ఈ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈమె కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనసూయ ఆస్తిపాస్తులు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.సినిమాలు, షోలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఓపెనింగ్స్‌తో అనసూయ నెలకు బాగానే సంపాదిస్తోందని స్పష్టమవుతుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఖరీదైన ఇల్లు, రెండు లగ్జరీ కార్లు, పొలాలు ఉన్నాయని చెబుతారు. తన సంపాదనను తెలివిగా పలు కంపెనీల్లో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడంతో ఈమె ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పాలి.. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అనసూయ ఇప్పటి వరకు సుమారు 40 కోట్లకు పైగా ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనసూయ భారీగానే ఆస్తులను కూడా పెడుతున్నారని చెప్పాలి.