Murder: నమ్మకంగా పనిచేసి జీతం అడిగిన వృద్దుడు.. పెట్రోల్ పోసి దారుణానికి పాల్పడిన యజమానులు..!

Murder: ఈ రోజుల్లో దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. పాత కక్షలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల
చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అచ్చం ఇలాంటి విషాదకరమైన సంఘటన ఒకటి తాజాగా మధురైలో చోటుచేసుకుంది. ఎంతోకాలం నుండి సెక్యూరిటీ సంస్థలో పనిచేసిన వృద్ధుడు జీతం ఇవ్వమని కోరడంతో అతి దారుణంగా పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆ వృద్ధుడు చేసిన కష్టానికి ఫలితం గా జీతము ఇవ్వకుండా ప్రాణం బలి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే..

మధురైకి చెందిన రత్నవేల్ (76) 4 సంవత్సరాల క్రితం కోయంబత్తూరు, రామనాధపురం వెళ్లి అక్కడ ఒక సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీలో పనికి చేరాడు. ఈ ఈ క్రమంలో యజమానులు చెప్పిన చోట సెక్యూరిటీ గార్డ్ గా నమ్మకంగా పని చేశాడు. ఇదిలా ఉండగా గత నాలుగు నెలలుగా సెక్యూరిటీ సంస్థ రత్నవేల్ కి జీతం ఇవ్వకపోవడంతో తనకు జీతం ఇవ్వాలని రత్నవేల్ యజమానులపై వత్తిడి చేశాడు.దీంతో కార్యాలయానికి వచ్చి జీతం తీసుకెళ్ళమని యజమానులు రత్నవేల్ కి చెప్పారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత రత్నవేలు కి యజమానులు అయిన కుమార్,జాన్ తో గొడవ జరిగింది. తర్వాత కొడిస్సియా ఏటీఎం సెంటర్ దగ్గర కి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని యజమానులు చెప్పటంతో రత్నవేల్ అక్కడికి చేరుకున్నాడు.

కొంత సమయం తర్వాత సంస్థ యజమానులు అక్కడికి వచ్చి ఏ టీ యం నుండి డబ్బులు డ్రా చేసి అతని దగ్గరకి వచ్చి చాలా నీచంగా ప్రవర్తించి అతనిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పారిపోయారు. మంటలలో చిక్కుకున్న రత్నవేల్ మంటల వేడికి తాళలేక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న రత్నవేలు శుక్రవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.