Hanumakonda: ప్రస్తుత సమాజంలో నిత్యం ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రాణాలను కోల్పోతున్నారు. రోజు రోజుకి చనిపోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో చనిపోవడం,గాయల పాలవడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, రూల్స్ ని అతిక్రమించడం ద్వారా వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇక నిత్యం జరుగుతున్న వాహన ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రమాదంలో కారణంగా రోజుకి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి కూడా ప్రజలలో మార్పు రాకపోవడం గమనార్హం.
కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా కాకుండా పొలంలో పని చేసుకుంటున్న సమయంలో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రదేశాలలో ఇలా ప్రతి ఒక్క చోట కూడా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హనుమకొండ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ జిల్లా లోని పరకాలలో మండల కేంద్రానికి చెందిన బొచ్చు విజయ్ అనే వ్యక్తి శనివారం రోజు ఇటుకుల బట్టి దగ్గర ఆటో డ్రైవర్ గా పనికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే విజయ్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఇటుకల కోసం ఉపయోగించే మట్టిలో పడిపోయింది.
ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడటంతో విజయ్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయాడు. ఇక ఈ ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. అంతేకాకుండా ఆ స్టీరింగ్ కింద ఇరుక్కుపోవడంతో దాదాపుగా గంటన్నరపాటు నరకయాతన పడ్డాడు. స్థానికులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేకపోయింది. దీనితో ప్రొక్లేయిన్ ని తీసుకువచ్చి విజయము బయటకు తీశారు.ప్రొక్లేయిన్ తో కూడా విజయ్ నువ్వు బయటికి తీయడానికి దాదాపుగా గంటన్నర సమయం పట్టింది. ఇటుకలు మట్టి బంక గా ఉండడంతో అతన్ని బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. అయితే ఈ ఘటనలో అతడు ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడు అని అందరూ భావించారు. కానీ అదృష్టవశాత్తు విజయ్ బతికి బయట పడ్డాడు. అతన్ని బయటకు తీసే సమయానికి అప్పటికే అతను స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే అతన్ని హుటాహుటిన హనుమకొండ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.