ఘోరం.. ఐదేళ్లలో సగటున 37 మంది శిశువులు మృతి.. ఎక్కడో తెలుసా?

భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్‌ నియోనాటల్ కేర్ యూనిట్ లో గత ఐదేళ్లలో సగటున దాదాపుగా 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో పోల్చుకుంటే 13 శాతం శిశు మరణాలు ఈ హాస్పిటల్ లోనే జరుగుతున్నాయి. ఈ ఏడాది 2020- 21 ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌ లో దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్‌లో చేరిన చాలా మంది శిశువులు క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్నారు. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ శాసనసభ్యుడు జిత్తు పట్వారి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి చనిపోతున్న శిశుమరణాల డేటాను అందించారు.

ఎక్కువగా నెలలు నిండని శిశువులకు కూడా హమీడియా ఆస్పత్రిలో చేరారని ప్రభురామ్ చౌదరి తెలిపారు. ఆ డేటాను పరిశీలించగా మధ్యప్రదేశ్ లోని హమీడియా ఆస్పత్రిలో అత్యంత ప్రమాదకరమైన ఆసుపత్రి అని పట్వారి పేర్కొన్నాడు. అయితే ఇది చాలా బాధాకరమైన విషయమని, ఈ విషయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఆ శిశు మరణాల పై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. పట్వారీ రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలు అలాగే వైద్య సిబ్బంది పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వీలైనంత తొందరగా నిర్ణయాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

2018 లో రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం అత్యధికంగా శిశుమరణాల రేటులో మధ్యప్రదేశ్ ముందంజలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి శిశు జననాలకు గాను 48 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. భవనాలు కోల్పోవడం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు జరగడం వంటివి వల్ల కూడా వందలాది శిశువుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని ఈ నివేదిక వెల్లడించింది. ఇటీవలే నవంబర్లో భోపాల్లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత 48 గంటల్లో మరో పది మంది చనిపోయారు