ఎంపీ ర‌ఘురామ‌కి అమిత్ షా అపాయింట్మెంట్

వైకాపా పై ర‌గ‌లిపోతున్న సొంత‌ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వ‌బోతున్నారా? జ‌గ‌న్ కి సాధ్యం కానిది ర‌ఘురామ‌కు ఎలా సాధ్య‌మ‌వుతోంది? ఆ ధైర్యంతోనే ర‌ఘురామ సొంత పార్టీపై తిర‌గ‌బడ్డారా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీగా మారిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది అనే అంశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌ల్ని షాక్ కి గురిచేస్తోంది. ఢిల్లీ లో ఉన్న మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న వైకాపా ముఖ్యలు జరగబోయే పరిణామాల పై ఒకింత ఆందోళన గా ఉన్న‌ట్లు స‌మాచారం.

సీఎం జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడని అమిత్ షా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీకి అవకాశం ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదన్న ప్ర‌చారం వేడెక్కుతోంది. మొదటి నుంచి బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఎంపి రఘు రామ మరో సారి తన సత్తా ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తెలియజేయాలి అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న జగన్ ఏడాది పాలనలో స్యాండ్,ల్యాండ్,వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం సొంత కులానికి చెందిన నేతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పొమ్మన లేక పొగబెడుతుంది ! అనే ఆలోచనకు రఘు వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రాజకీయానికి ధీటైన జవాబు ఇవ్వాలని రఘు భావిస్తున్నారు అట. ఏడాది పాలనలో ఎంపీ బయటపడ్డారు. అలాగే సుమారుగా పదుల సంఖ్యలో అసంతృప్తి నాయకులు,సీనియర్లు నిరసన గళం వినిపించారు. ధర్నాలు ,నిరసనలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పేరుకుపోయిన ఒకే సామాజిక వర్గ కోటరీ దెబ్బకి బయటపడిన వారు పదుల సంఖ్యలో ఉంటే లోలోపల అగ్ని గుండంలా ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు అన్న మాట వాస్త‌వం. వారిని ఒకే తాటిపైకి తెచ్చి రఘు తిరుగుబాటు చేస్తారని అందుకు ఆయన కార్యచరణ కూడా మొదలుపెట్టారని స‌మాచారం. సౌత్ ఇండియా లో బలపడాలి అనేది బీజేపీ సుధీర్ఘకాల ఆరాటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జ‌రుగుతోన్న‌ ఈ పరిణామాలను తమకు అనుగుణంగా మార్చుకొని త్వరలోనే ద‌క్షిణాదిన క‌మ‌లం జెండా ఎగిరెలా చెయ్యాలనే ఆలోచన తో ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి ఆగమేఘాల పై అపాయింట్మెంట్ దొరికింది అని హస్తిన సమాచారం.