ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం కొత్తగా 1000కి పైగా అంబులెన్స్ లను విజయవాడ బెంజి సర్కిల్ లో జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధునాతన టెక్నాలజీ తో కూడిన ఈ వాహనలు బాధితుల్ని ఆసుపత్రికి తరలించడనాకి మరింత గా అన్ని వసతులతో సిద్దం చేసారు. గత క్రాంట్రాక్ట్ బీవీజీని తప్పించి అరిబిందో సంస్థకు సర్వీసుకు సంబంధించిన పనులను అప్పగించి కొత్త అంబులెన్స్ లను సిద్దం చేసింది ప్రభుత్వం. ఈ వాహనాల కొనుగోలు విషయంలో టీడీపీ నేతలు 300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా వాహనాల ప్రారంభోత్సవాన్ని ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్-విజయసాయి బంధం బలపరచడం కోసం విజయసాయి పుట్టిన రోజు నాడు సీఎం జెండా ఊపి వాహనాలు ప్రారంభించడం చాలా గొప్పగా ఉందని, ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా ప్రారంభోత్సవం జరిగిందని టీడీపీ నేత పట్టాభిరాం విమర్శించారు. అంబులెన్స్ రోడ్డుమీద వెళ్తుంటే 307 కోట్లు ఆయన ఇంటికి తరలి వెళ్తున్న ఫీలింగ్ కల్గుతుందన్నారు. ఇలాంటి పనులు సీఎం కేసాధ్యమవుతాయని ఎద్దేవా చేసారు. కోట్ల రూపాయాలు ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారని దుయ్యబెట్టారు. అలాగే డిసెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్న బీవీజీని తప్పించి అరబిందో సంస్థకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. అయితే బీవీజీని తప్పించి అరబిందో కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై నేరుగా అంబులెన్స్ సిబ్బందే పట్టాభిపై నిప్పులు చెరిగారు.
జీవీకే నుంచి బీవీజీకి సర్వీసు కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి వాహనాల మెయింటనెన్స్ గాలికొదిలేసారన్నారు. కనీసం టైర్లకు గాలి కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ర్టంలో కొన్ని వాహనాలైతే బ్రేకులు కూడా సరిగ్గా ఉండేవి కాదని ఆరోపించారు. రోగిని ఎక్కించుకుని వస్తున్నప్పుడు మధ్యలో వాహనం ఏకారణం చేతనైనా నిలిచిపోతే..మెకానిక్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఆ పరిస్థితులన్నింటిని వాహన డ్రైవర్లు, ఇతర సిబ్బందే చూసుకోవాల్సి వచ్చేదన్నారు. బీవీజీ పెట్టిన బకాయిలు కారణంగా వాహనాలకు మరామత్తులు చేయడానికి ఏ మెకానిక్ కూడా ముందుకు వచ్చేవారు కాదని ఆరోపించారు. బీవీజీ సంస్థ అంటే 4 వీలర్ మెకానిక్ వర్గంలో అంతగా పాపులర్ అయిందన్నారు. ఈ కారణాలుగానే జగన్ సర్కార్ బీవీజీని తప్పించి అరబిందో సంస్థకు అప్పగించినట్లు పట్టాభి వ్యాఖ్యలపై సిబ్బంది మండిపడ్డారు. రాజకీయాలు ఏవైనా ఉంటే మిగతా విషయాల్లో చూసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడే వాహనలపైన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వానికి చేతకాదు, చేసే వాళ్లను చూస్తే ఓర్వలేక ఉండలేరని దుయ్యబెట్టారు.