తాజాగా మంత్రి అంబటి రాంబాబు బీజేపీ పార్టీ పై విమర్శలు చేశారు. ఈయన ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండవచ్చేమో.. దేశంలో పెద్ద పార్టీ కావచ్చేమో.. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ తుస్సే.
తెలుగుదేశం పార్టీ పోటీ చేయనందునే వారు కనిపిస్తున్నారు అంటూ.. నిజానికి వారి సైజ్ ఎంత, వారికి వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటూ.. తను ఏదో అనడం ద్వారా ప్రచారం పొందాలని ఉబలాటం ఆ పార్టీ నాయకులు కనిపిస్తుంది అని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనం తోనే అభివృద్ధి పనులు చేపడుతున్నారు అని అన్నారు.