AP: నాగబాబుకు ఎమ్మెల్సీ… తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ వేసిన అంబంటి!

AP: ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయబోతున్నారు. అయితే కూటమి పార్టీల నుంచి కూడా ఈ ఐదుగురు ఎమ్మెల్సీలను నియమించబోతున్నారు ఇందులో భాగంగానే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా నాగబాబును ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టి అనంతరం ఆయనని ఏపీ క్యాబినెట్లో తీసుకోబోతున్నారని గతంలోనే ప్రకటించారు.

ఇక నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికైన నాగబాబుకు తిరిగి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం గురించి సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఈ విషయం గురించి స్పందిస్తూ అన్నని దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి తీసుకురావటంలో విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఎన్నికలలో ఏమాత్రం పోటీ చేయకపోయినా నాగబాబు మంత్రిగా కేబినెట్ లోకి రావడం తన అన్నయ్యను మంత్రిని చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడంలో సక్సెస్ సాధించారంటూ అంబటి విమర్శించారు.

నిజానికి నాగబాబు గత ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా బిజెపికి వెళ్లడంతో ఆయన తన టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది అంతేకాకుండా కూటమి గెలుపు కోసం నాగబాబు ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలోనే తన అన్నయ్య కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇలా పవన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం గురించి ఇంకా అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పాలి.