Ambanti: ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు…మరీ ఇంత ఘోరమా: అంబటి

Ambanti: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైకాపా పార్టీ ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించింది ఎవరి సపోర్టు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తూ 151 స్థానాలలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఈ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉందని చెప్పాలి. ఇక 2024 ఎన్నికలలో కూటమి పార్టీల 164 స్థానాలలో విజయం సాధించిన మూడు పార్టీలు కలిపి ఆ స్థాయిలో విజయం సాధించాయి.

2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చడమే కాకుండా మరోవైపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవి మాత్రమే కాకుండా చొప్పనివి కూడా చేసి జగన్మోహన్ రెడ్డి చూపించారు కానీ ఆయన చేసిన అభివృద్ధిని బయటకు చెప్పుకోలేకపోవడమే తమ పార్టీ ఓటమికి కారణం అంటూ ఎంతోమంది వైకాపా నాయకులు కూడా తమ ఓటమి గురించి బహిర్గతమయ్యారు.

ఇకపోతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 8 నెలలు అవుతున్న ఇంకా వైకాపా తమ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం వైకాపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైకాపాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. పోనీ మనకు అర్థం కాలేదు ఓకే. మరి కూటమి పార్టీకి ఎందుకు 164 స్థానాలు వచ్చాయో వారికి కూడా అర్థం కాలేదు అంటూ అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఇద్దరు, ముగ్గురు కలవడం వల్ల అన్ని సీట్లు వచ్చాయా? వైకాపాపై తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా మాయ జరిగిందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఓటమి పాలయ్యాం. పంట సరిగా పండలేదు తిరిగి వ్యవసాయం చేయాల్సిన సమయం వచ్చింది అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.