అమరావతి కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే.. ఆ కేసును తాజాగా ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇది కావాలని ప్రభుత్వం చేసిన పని అని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఏదీ లేదని.. ఓ వ్యక్తి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆ కేసులను కొట్టేసింది. అసలు.. భూములు అమ్మడం, కొనడం లాంటివి నేరం ఎలా అవుతాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఎలా పెడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే.. హైకోర్టు తీర్పు ఏపీ రాజకీయాలనే మార్చేసే అవకాశం ఉంది.
నిజానికి అమరావతి క్యాపిటల్ ను ప్రకటించడానికంటే ముందే.. టీడీపీ హయాంలో భూములను తక్కువ ధరకు కొనుక్కున్నారని… వేల కోట్లను కూడబెట్టుకున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వం ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ అధికారులు.. అప్పుడు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారిపై కేసులు పెట్టారు. కానీ.. ఆ కేసులను ప్రస్తుతం హైకోర్టు కొట్టేసింది. చూద్దాం మరి భవిష్యత్తులో అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడిదాకా వెళ్తుందో? హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికైనా సీఎం జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.