చంద్రబాబు పేరు చెబితే అమరావతి రైతులు మండి పడుతున్నారు .. కారణం తెలిస్తే తప్పులేదు అంటారు

Politacl Latest Updates In telugu rajyam

దేశం కరోనాతో పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం రాజధాని కోసం పోరాడుతున్నారు. ఎలాగైన రాజధానిని అమరవతిలోనే ఉంచాలని టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్షాల నేతలు పోరాడుతుంటే, యాడ్స్ స్థాయిలో వైసీపీ నేతలు కూడా రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం అక్కడి రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని తరలిస్తుంటే రైతులు అడ్డుపడుతున్నారు. రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు నిలుస్తున్నారు. వారు చేస్తున్న ప్రతి విషయానికి మద్దతుగా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు రాజధాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కేంద్రం కూడా రాజధానిపై తామే ఏమి చేయలేమని కోర్ట్ సాక్షిగా చెప్పడంతో టీడీపీ ఏమి చేయాలో తోచడం లేదు. కోర్ట్ కూడా ఈ విషయంలో వైసీపీకి ప్రస్థుతానికి బ్రేక్స్ వేస్తున్నా కూడా దీర్ఘకాలికంగా అడ్డుకోవడం లేదని తెలుసుకున్న టీడీపీ వేరే విషయాలపై దృష్టి పెడుతుంది. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత కూడా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో కూడా ఎక్కడా రాజధాని అంశాన్ని ప్రస్తావించడం లేదు.

అమరావతిపై చంద్రబాబు పట్టించుకోకపోవడంతో రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని నమ్మి మేము భూములు ఇస్తే ఇప్పుడు అతను మమ్మును పట్టించుకోవడం లేదని, గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు కూడా తమ దగ్గరకు రావడం లేదని అమరావతి రైతులు చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు తమను సీఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తుంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోకుండా మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ రాష్ట్రంలో తన బలాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు అమరావతి రైతుల విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తే చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో మరింత దీన స్థాయికి పడిపోతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.