Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో హీరోగా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలలో నటించనున్నారు. ఒక సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు డార్లింగ్ ప్రభాస్. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే అమరన్ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి కాంబోలో ఒక మూవీ విడుదల కానుందట.ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రభాస్ ను కలిసి రాజ్ కుమార్ ఒక కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్ కుమార్ కూడా ధనుష్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్‌మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో దర్శకుడి కాంబినేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.