Amani Comments on Roja : నిన్నటి తరం హీరోయిన్లు రోజా, ఆమని గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ఇద్దరూ ఫేడ్ అవుట్ అయినా… క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సీరియళ్లలు, సినిమాల్లో నటిస్తున్నారు. రోజు ప్రస్తుత ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు జబర్థస్త్ షో జడ్జీగా చేయడంతో పాటు పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆమని ప్రసుత్తం సినిమా, సీరియళ్లలో నటిస్తున్నారు.
ఈ ఇద్దరు 90ల్లో చేసిన ‘శుభలగ్నం’ అప్పట్లో సంచలనం. ఆమని, రోజా నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. 1994 ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో జగపతి బాబు, ఆమని, రోజా హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
డబ్బు ఆశతో భర్తనే అమ్ముకునే క్యారెక్టర్ లో ఆమని ఇరగదీశారు. ఆమె పోషించిన పాత్రపై ఇప్పటికీ పలు షోల్లో స్ఫూఫ్స్ వస్తూనే ఉన్నాయి. అంతగా రిజిస్టర్ అయింది ఆ క్యారెక్టర్.
ఇటీవల జబర్థస్త్ షోకు ప్రత్యేక అతిథిగా ఆమని వచ్చారు. అయితే నెక్ట్ వీక్ వచ్చే జబర్ధస్త్ ప్రోగ్రాం ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో ఆమని సంచలన కామెంట్లు చేశారు. ‘నాభర్త నాదగ్గర, రోజా భర్త రోజా దగ్గరే ఉన్నారంటూ’.. కామెంట్లు చేస్తోంది. ఎవరి భర్తలతో వారు హ్యాపీగా ఉన్నామన్నారు. దీంతో ఒక్కసారిగా సెట్ లో నవ్వులు విరబూశాయి. శుభలగ్నం సినిమాకు సంబంధించి ప్రశ్నలు రావడంతో ఆమని ఈ విధంగా స్పందించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోగ్రాంగా ఉన్న జబర్థస్త్ లో ఎవరు ఏమీ మాట్లాడినా.. వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమని చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.