అప్పుడే ఎన్టీఆర్ – కొరటాల భారీ మాస్ సినిమాకి రిలీజ్ డేట్ కన్ఫర్మ్..?

తన సినిమాలతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ దర్శకునిగా ముద్ర వేసుకున్న దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన భారీ చిత్రం “ఆచార్య” తో తన కెరీర్ లైన్ ఘోరమైన ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. అయినా కూడా తన నెక్స్ట్ సినిమాకి మాత్రం ఎనలేని హైప్ ని సొంతం చేసుకున్నాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ 30 గా ఇప్పుడు పరిగణించబడుతుంది. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా అప్పుడే ఈ సినిమాకి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నటువంటి రిలీజ్ డేట్ అంటూ పలు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. 

మరి వారు చెప్తున్నా దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది 2023 మే 19న రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వని సినిమాకి డేట్ ఫిక్స్ చేసేయడం అనేది ఆసక్తిగానే ఉంది. మరి చూడాలి ఈ సమయానికే వస్తుందో లేదో అనేది.

ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీత దర్శకునిగా ఫిక్స్ కాగా హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరూ ఫిక్స్ అవ్వలేదు. ఇది సెట్ అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది.