ఆ విమాన సిబ్బందులతో పాటు నడిపేది కూడా మహిళలే..

మన దేశం గురించి పక్కన పెడితే ఇతర దేశాలలో మహిళలకు కొన్ని చట్టాలు ఉంటాయి. కొన్ని దేశాలలో ఆడవారికి స్వతంత్రం కూడా ఉండదు. కానీ సౌదీ అరేబియాలో ఇటీవలే మహిళలకు స్వతంత్రాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో తొలిసారిగా ఒక విమానాన్ని మొత్తం మహిళలే హ్యాండిల్ చేస్తున్నారు.

మహిళా సిబ్బంది లతో పాటు విమానం నడిపే వారు కూడా మహిళలే. ఈ విమానాన్ని ఇటీవలే ప్రారంభించామని ఒక చిన్న దేశీయ ప్రయాణాన్ని కూడా చేసిందని తెలిపారు. ఇక ఈ విమానాన్ని ఎర్ర సముద్ర తీరం నుంచి జెడ్డా వరకు నడిపారట. సౌదీ విమానయాన చరిత్రలో 320 విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితో కనిపించడం ఇదే తొలిసారి అని అన్నారు.