Allu Arjun: పునీత్ రాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్!

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ నేడు బెంగళూరుకు వెళ్లారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ ఆకస్మికంగా మరణించడంతో సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఈయన మరణం కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ చిత్రపరిశ్రమను కృంగదీసింది. ఇదిలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పుడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప సినిమా చిత్రీకరణ పనులలో బిజీగా ఉండటం వల్ల ఆయన అంత్యక్రియలకు రాలేకపోయారు.అదేవిధంగా పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బెంగుళూరుకు వెళ్లిన పునీత్ కుటుంబ సభ్యులను కలవలేకపోయారు.

ఈ క్రమంలోని అల్లు అర్జున్ నేడు ప్రత్యేకంగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం బెంగళూరుకు వచ్చారు. ఈ క్రమంలోనే ముందుగా ఆయన పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయనను కలిసి అనంతరం అతని ఇంటి నుంచి కంఠీరవ స్టూడియోకు వెళ్లారు. అక్కడ ఆయన సమాధిని దర్శించుకున్న అల్లుఅర్జున్ తనతో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు.ఇక ఈయన మృతి పట్ల గతంలో స్పందిస్తూ అల్లుఅర్జున్ ఇద్దరికీ ఎంతో మంచి అనుబంధం ఉండేదని తాను బెంగళూరు వచ్చినా… లేదా పునీత్ హైదరాబాద్ వచ్చిన ఎప్పుడూ కలిసే వాళ్ళం అని గతంలో అతని గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పునీత్ మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను మొదటిసారిగా కలిసిన అల్లు అర్జున్ ఆయన సమాధికి నివాళులు అర్పించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ బెంగళూరు పర్యటనకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 చిత్రీకరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.