Allu Arjun: కన్నడ మీడియా నుంచి అల్లు అర్జున్ కు ఎదురైన చేదు అనుభవం.. క్షమాపణలు చెప్పిన బన్నీ!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల కావడంతో పలు భాషలలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇదిలా ఉండగా తాజాగా నేడు బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమానికి పుష్ప చిత్రబృందం హాజరుకానున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే కన్నడ మీడియా 11 గంటల 15 నిమిషాల నుంచి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంది.

ఉదయం 11 :15 నిమిషాలకు ప్రెస్ మీట్ అని చెప్పి అల్లు అర్జున్ 1:15 రావడంతో అల్లు అర్జున్ పై కన్నడ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇక ముందుగానే ప్రెస్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ రాగానే మీడియా సభ్యులు ఒకరు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి మీరు 1:00 కు రావడం చూస్తుంటే మీరు కన్నడ మీడియాను అవమానించారని ఒక మీడియా వ్యక్తి ఘాటుగా అల్లుఅర్జున్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కన్నడ మీడియాకు క్షమాపణలు చెప్పారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇక్కడ ప్రెస్ మీట్ ఉందనే విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది తెలియగానే వెంటనే ప్రవేట్ జెట్ లో హుటాహుటిన బయలుదేరి వచ్చాను అలాగే మధ్యలో పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్ ఇష్యూ వలన కొద్దిగా ఆలస్యం అయ్యింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే.. నా కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానని కన్నడ మీడియాకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు.